రెండు రోజులపాటు ఓటు నమోదు కార్యక్రమం
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 02, మహానంది:
మహానంది మండలంలో రెండు రోజులపాటు ఓటరుగా పేరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మహానంది మండల తాసిల్దార్ జనార్ధన్ శెట్టి పేర్కొన్నారు .శని మరియు ఆదివారాల్లో జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు తమ ఓటు హక్కును సంబంధితగ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లవద్ద నమోదు చేసుకోవాలని సూచించారు .ఆధార్ కార్డు తో పాటు వయసు ధ్రువీకరణ పత్రాలను మరియు కలర్ ఫోటో వారి తల్లిదండ్రులు ఓటర్ కార్డును జత చేయాల్సి ఉంటుందన్నారు .అవకాశాన్ని అర్హులైన వారందరూ ఉపయోగించుకోవాలని తాసిల్దార్ జనార్ధన్ శెట్టి కోరారు .