హైదరాబాద్: కాంగ్రెస్ పరిస్థితిపై పార్టీ అనుబంధ సంఘాల సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో రేవంత్రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ను లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. పార్టీలో ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదని చెప్పారు. అందరం సమానమే.. కలిసి ముందుకుపోదామని రేవంత్రెడ్డి అన్నారు.గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికపై.. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అనుబంధ సంఘాలను కోరారు.ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని.. అందరం బాధ్యతగా కార్యక్రమాలు చేపట్టి సమస్యలపై పోరాడాలని రేవంత్రెడ్డి తెలిపారు..