హామీలు నెరవేర్చకపోతే తన్నీ తరిమేయండి

షాద్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్

టిఆర్ఎస్ బిజెపి పాలనా తీరుపై కాంగ్రెస్ పార్టీ ధ్వజం

కేశంపేట మండలంలో వీర్లపల్లి శంకర్ సుడిగాలి పర్యటన

దేవుని గుడి తండాలో కాంగ్రెస్ లో చేరికలు

షాద్ నగర్, : టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఊళ్లోకి అడుగుపెడితే ప్రజలు అందరూ కలిసి వారిని తన్ని తరిమేయాలంటూ షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. నియోజక వర్గంలోని కేశంపేట మండలంలో ఆయా గ్రామాల్లో వీర్లపల్లి శంకర్ తదితరులు పెద్ద ఎత్తున సుడిగాలి పర్యటన చేపట్టారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు పార్టీలో పలువురిని చేర్చుకున్నారు. అదేవిధంగా ముఖ్య కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి వారిలో మనోధైర్యాన్ని నింపారు. తెరాస, బిజెపి చేస్తున్న అరాచక పాలనను అంతమొందించాలంటూ ఆయా గ్రామాల్లో వీర్లపల్లి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేశంపేట్ మండలంలో వీర్లపల్లి శంకర్ మండల పార్టీ అధ్యక్షులు గూడ వీరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశప్ప ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటనలో భాగంగా మొదటగా ఇప్పలపల్లి గ్రామంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. దేవుని గుడి తండాలో టిఆర్ఎస్ పార్టీలో నుండి దాదాపు 55 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కొండారెడ్డిపల్లిలో కార్యకర్తల సమావేశం, కాకునూరు గ్రామంలో నూతన గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు. తొమ్మిది రేకుల గ్రామంలో అవధూత కిషన్ ప్రభు మాస శివరాత్రి 5వ వార్షికోత్సవం కార్యక్రమంలో హాజరయ్యారు.


లింగందన గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు యాదయ్య యాదవ్, బాబర్ ఖాన్, రఘు, ఎల్లారెడ్డి, రామ్ రెడ్డి, నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, శ్రీశైలం, నలమోని శ్రీధర్, వేముల నర్వ గోపాల్, శ్రీనాథ్, ముబారక్, రాయికల్ శ్రీనివాస్, భూపాలపల్లి డిప్యూటీ సర్పంచ్ రమేష్, అర్జున్ లక్ష్మణ్, పసల బుచ్చయ్య, రూప్లనాయక్, ఎస్టీ సెల్ శీను నాయక్, ఇబ్రహీం, బుడ్డా నరసింహ, రూప్సింగ్, సీతారాం, కొత్తూరు నర్సింహులు, మందుల రమేష్, శివ, అశోక్, నవీన్, కిట్టు, రానా, రాజు తదితరులు పాల్గొన్నారు.

దేవునిగుడి తండాలో పార్టీలో చేరిన వారిలో..

మాజీ ఎంపీటీసీ పీరియా నాయక్, సోమల నాయక్, లక్ష్మణ్ నాయక్, కిషన్ నాయక్, లక్ష్మణ్ నాయక్, తులసి రామ్ నాయక్, జానియా నాయక్, దశరథ్, రాజు నాయక్, దశరథ్ నాయక్, ధామ్యా నాయక్, గోపాల్ నాయక్, బుక్మన్ నాయక్, రాజు నాయక్, కే సూర్య నాయక్, స్వరూప, బుజ్జి, రత్మి, బుజ్జి, గౌరీ, జానకి, వికీ, పద్మ, లక్ష్మి, లీల, బుజ్జి, ఎన్ రాములు, కే శంకర్ నాయక్, కే శీను నాయక్, వి దాసు నాయక్, ఎన్ రాములు నాయక్, కే రమేష్, వి బాబు, ఎం రవి, ప్రియా, ముర్తుజా, రాజు, శీను నాయక్, వినోద్ కుమార్, అంబుజా, జై శంకర్ నాయక్, జే బాబు, వి భాష, ఎం శీను, ఆర్ శీను, కే నగేష్, కే శ్రీకాంత్, ఎన్ నరేష్, తదితరులు చేరారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!