వన సమారాధనలు ఐక్యమత్యానికి ప్రతీకలు….
ఘనంగా రాజానగరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వన సమారాధన కార్యక్రమం…
ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె. మాధవి లత…
అలరించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు…
కొద్దిసేపు ఆటల పోటీలలో పాల్గొని మహిళలను ఉత్తేజపరిచిన జిల్లా కలెక్టర్ కె.మాధవి లత….
వన సమారాధన కార్యక్రమాలతో కుటుంబాల్లో ఆత్మీయ అనురాగాలతో పాటు ఐకమత్యం పెంపొందిస్తాయని జిల్లా కలెక్టర్ కె.మాధవి లత పేర్కొన్నారు..
సోమవారం నాడు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా సీతానగరం మండలం నల్గొండ గ్రామం నందు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన రాజానగరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వన సమారాధన కార్యక్రమములో జిల్లా కలెక్టర్ కె.మాధవి లత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె మాధవి లత మాట్లాడుతూ ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజానగరం నియోజకవర్గ వన సమారాధన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
కార్తీక వన సమారాధన వంటి మంచి సంప్రదాయ కార్యక్రమాల ద్వారా విభిన్న రంగాలలో పనిచేసే వారి రోజువారి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని, మనందరం ఐక్యంగా కనబరిచేందుకు వన సమారాధనలు ఎంతో దోహదపడతాయన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలి అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ ఒకచోట కలిసే విధంగా వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు..
మన ప్రియతమ ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తద్వారా మెరుగైన పాలన అందించడంలో వాలంటరీల పాత్ర విశేషమైందన్నారు.
పార్టీ శ్రేణులు ఇటువంటి అవరోధాలకు తావు లేకుండా ఐక్యమత్యంతో మెలిగే విధంగా ఇటువంటి వన సమారాధనలు దోహదపడతాయని రాబోవు రోజులలో అందరూ కలిసి పార్టీని మరింత బలోపేతం చేసి అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజిసీ సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి, జడ్పిటిసిలు వాసంశెట్టి పెద్ద వెంకన్, కర్రీ నాగేశ్వరరావు, చల్లమళ్ళ వెంకట లక్ష్మి, మండల కన్వీనర్లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.