చౌరస్తాలో చెప్పుతో కొడతా
ఎంపీ అరవింద్ కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు కార్యకర్తలు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. కాగా కల్వకుంట్ల కవితపై అరవింద్ చేసిన వ్యాఖ్యలు కారణంగానే అరవింద్ ఇంటిని ముట్టడించినట్లు టీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. ఇక తాజాగా అరవింద్ వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పు తీసి కొడతా.. పట్టుకుని తంతా అని అరవింద్ ను కవిత హెచ్చరించారు. ఎంత మాట్లాడితే అంత మాట్లాడితే చూస్తూ ఊరుకోము. రాజకీయాలు చెయ్ కానీ పిచ్చి వేషాలు వేయకని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..