మాతృభాష పరిరక్షణకు కవులు చేస్తున్న కృషి అభినందనీయం
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 17, మహానంది:
మాతృభాష పరిరక్షణకు కవులు చేస్తున్న కృషి అభినందనీయం అని ప్రధానోపాధ్యాయులు నారాయణ పేర్కొన్నారు.మహానంది మండలం తిమ్మాపురం హైస్కూలులో గ్రంధాలయ అధికారి రవిరాజు ఆధ్వర్యంలో గురువారం 55వ గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నారాయణ అధ్యక్షతన రచయితలు,కవులు, కళాకారుల సమ్మేళనంలో భవానీలీలావతి, కనమర్లపూడి రామయ్య, సంఘశ్రీ గద్వాల రామకృష్ణుడులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తలవంచి చదివితే భవిష్యత్ లో ఎక్కడైనా, ఏ దేశంలోనైనా తలెత్తుకొని జీవించవచ్చు అన్నారు. గ్రంధాలయాలు విజ్ఞాన బాంఢాగారాలని, వాటిని కాపాడుకోవాలని చెప్పారు. మాతృభాషను పరిరక్షణకు కవులు, కళాకారులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.