భార్య దూరమయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కోపం. వెరసి అతను ఫేక్ బాంబ్ కాల్ చేసేలా మార్చింది. సైదాబాద్ ఇన్స్ పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ నగర్ కాలనీకి చెందిన ఎండీ అక్బర్ ఖాన్ ఇంటర్ వరకు చదివాడు. వివాహమైనా భార్య దూరంగా ఉంటోంది. దీనికి సంబంధించి గతంలో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అక్బర్ ప్రవర్తన నచ్చక దూరంగా ఉంటున్నానని పోలీసులకు అతడి భార్య తెలిపింది. భార్య, పోలీసులపై కోపం పెంచుకున్న అక్బర్ మంగళవారం రాత్రి పోలీసులకు ఫోన్ చేసి ఐఎస్ సదన్ లోని మసీదు దగ్గర కొంతమంది బాంబు పెట్టనున్నట్లు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసుల ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఫేక్ కాల్ అని తేలడంతో విచారించి అక్బర్ ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచగా కోర్టు 18 రోజల జైలు శిక్ష విధించింది. సైదా బాద్ పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.