హైదరాబాద్:బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ మరో దశ ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు.ఈ నెల 28 నుంచి ఐదో దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. ముథోల్ నుంచి కరీంనగర్ వరకు యాత్ర కొనసాగుతుందని భైంసాలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో లక్ష ఓట్లే లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందని బండి సంజయ్ తెలిపారు.