తాను బతికున్నంత వరకు శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉండేలా చూస్తానని, పోయిన తర్వాత వాటిని దానం చేస్తానని యువ నటుడు విజయ్ దేవరకొండ వెల్లడించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మాదాపూర్లోని పేస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిన్నారుల్లో కాలేయ మార్పిడి అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. దానికి విజయ్ పాటు మలావత్ పూర్ణ పాల్గొన్నారు. కాలేయ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం 24 గంటల హెల్ప్ లైన్ సేవలను వీరిద్దరూ ప్రారంభించారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించి వారికి బహుమతులు అందించారు. “విలువైన అవయవాలను మట్టిపాలు చేసే బదులు ఇంకొకరికి దానం చేస్తే వారి ఆయుష్షును పెంచినవారమవుతాం” అని విజయ్ పిలుపునిచ్చారు.