సేవా కార్యక్రమాలకు యువత ప్రాధాన్యం ఇవ్వాలి – డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి
తిరుపతి
సేవా కార్యక్రమాలకు యువత తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్ర స్వామి అన్నారు. తిరుపతి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం బోర్డు మెంబెర్ కమల పత్ర అవార్డు గ్రహీత నామా రాజేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటి స్పీకర్ కొల్లగట్ల వీరభద్ర స్వామి శాలువా పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. జూనియర్ చాంబర్ ఇంటర్నెషనల్ సంస్థ సమాజ సేవా, యువకులలో వికాసం పెంపొందించడానికి బలమైన విశేష కృషి చేస్తున్ననటువంటి కార్యక్రమాలుకు గాను ఆర్యవైశ్య సంఘం నాయకులు, జై కాం చైర్మెన్ నామా రాజేష్ కుమార్ కు ఇటివల కమల పత్ర అవార్డు రావడాన్ని ప్రస్థావిస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జేసీ నామా రాజేష్ కుమార్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నత స్థానానికి వెళ్లాలని డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్ర స్వామి రాజేష్ కుమార్ ను వెన్ను దట్టి ప్రోత్సహించారు.