నేరాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించండి. సీ.ఐ మీసాల రాంబాబు.
ప్రకాశం జిల్లా.. స్టుడియో10టివి న్యూస్…
త్రిపురాంతకం సర్కిల్ పరిదిలోని దొనకొండ కురిచేడు త్రిపురాంతకము మండలాల్లొ నేరాలు, దొంగతనాలు దోపిడీలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలనీ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని త్రిపురాంతకం పోలీస్ సర్కిల్. ఇన్స్పెక్టర్ మీసాల రాంబాబు అన్నారు. బుధవారం త్రిపురాంతకం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో దొనకొండ, కురిచేడు. త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ల. ఎస్సైలతో క్రైమ్ మీటింగ్ జరిగింది. ఈ క్రైమ్ సమావేశంలో సిఐ మీసాల రాంబాబు మాట్లాడుతూ గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా. దారిదోపిడిలు మత సంఘర్షణలు అల్లర్లు జరగకుండా శాంతియుతంగా ఉండేందుకు త్రిపురాంతకం దొనకొండ కురిచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైలు మరియు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ప్రజా చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా నివారించేందుకు సూచనలు సలహాలు సూచించారు గ్రామాల్లో గుట్కా వ్యాపారం, సారా వ్యాపారం. జూదము. కోడి పందాలు వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు ఆయా స్టేషన్ల ఎస్ఐలు ప్రత్యేకంగా దృష్టి సారించి గ్రామాల్లో తిరగాలని సిఐ ఎస్ఐలకు సూచించారు ఎవరికైనా ఎలాంటి సమస్య ఉన్న శాంతి భద్రత విఘాతంకలగకుండా ఉన్నందుకు ప్రజలు ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కారం చేస్తామని రాంబాబు అన్నారు. ఈ క్రైమ్ సమావేశంలో దొనకొండ ఎస్సై అంకమ్మ. త్రిపురాంతకం ఎస్ఐ జి వెంకట సైదులు. కురిచేడు ఎస్సై దేవప్రసాద్ పాల్గొన్నారు.