జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు, జగనన్న మోసం అనే ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన మండల జనసేన నాయకులు
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 13, మహానంది:
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు మహనంది మండలంలోని తిమ్మాపురం గ్రామాల్లోని జగనన్న కాలనీలలో
జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ మరియు జగనన్న మోసం ప్లకార్డ్లతో సోషల్ ఆడిట్ ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామంలోనీ మోడల్ స్కూల్ పక్కన జగనన్న ఇళ్ల కోసం కేటాయించిన స్థలాలు కనీసం ఒక్క ఇల్లు కూడా ప్రారంభించలేదన్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 శాతం ఇళ్లను పూర్తి చేయలేదు. చాలాచోట్ల ఇప్పటివరకు పనులు కూడా పూర్తిగా ప్రారంభం కాలేదని కానీ ప్రభుత్వం పూర్తి చేసినట్లు పేపర్లో ప్రకటనలు చేయడం సిగ్గుచేటు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్నట్టు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న 1.80 లక్షల రూపాయల పునాది వరకు కూడా రావడంలేదు అని లబ్ధిదారులు వాపో తున్నారని అన్నారు.వర్షాలు వచ్చినప్పుడు కాలనీ మొత్తం నీళ్లలోనే ఉండే పరిస్థితి అంత దిగువన స్థలాన్ని పేదలకు ఇస్తే ఎలా ఇళ్ళు ఎలా కట్టు కుంటారన్నారు.జగనన్న కాలనీలలో జరుగు తున్న అవినీతి అక్రమాలను గురించి పరిశీలించి వాటిని గుర్తించడం జరిగింది.త్వరలోనే జగనన్న ఇళ్లు అవినీతి కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పూర్తిస్థాయిలో బయటపెట్టబోతున్నా ము అని జనసేన మండల నాయకులు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో మారెడ్డిరామయ్య, మహేష్ స్వామి, నల్లబోతుల మల్లిఖార్జున, పి. విజయుడు,కిట్టు వేణుగోపాల్, ఎస్. కళ్యాణ్,డిటీ చెన్నకేశవులు. భరత్, వైవి.శివ నాగిరెడ్డి, శ్రీకాంత్, జనసైనికులు పాల్గొన్నారు.