ఐఐఎం అహ్మద్బాద్ లో నాయకత్వ శిక్షణకు తిమ్మాపురం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎంపిక
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 13, మహానంది:
పాఠశాల విద్యా ప్రమాణాల వృద్ధి కొరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ శిక్షణ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను అక్టోబర్ 7న రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాలతో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు నిర్వహించబడిన ఆన్లైన్ పరీక్షలో రాష్ట్రంలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన 177 మందిని తొలిరేండ్ల ఎంపిక చేశారు. తుది రౌండ్ లో భాగంగా మొదటి రౌండ్లో ఎంపికైన ప్రధానోపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి ప్రణాళికపై ఆంగ్లంలో ఐదు నిమిషాల్లో నిడివికల వీడియోను మాట్లాడి అప్లోడ్ చేయడం ద్వారా వారి నుంచి 50 మంది అహ్మద్బాద్ లోని ఐఐఎం లో వారం రోజుల శిక్షణకు ఎంపిక చేయగా వారిలో తిమ్మాపురం ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కే లక్ష్మణరావు ఎంపికయ్యారు. ఈనెల 20 నుండి వారు ఈ శిక్షణకు హాజరుకానున్నారు. విద్యా ప్రమాణాల అభివృద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి.ఈ శిక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి ఎంపిక కావడం సంతోషంగా ఉందని లక్ష్మణరావు అన్నారు. ఈ శిక్షణ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మరింత సమర్థవంతంగా విద్యను అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ప్రిన్సిపల్ లక్ష్మణరావును అభినందించారు.