జర్నలిస్ట్ కృష్ణపల్లిసురేష్:- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఇంటర్మీడియట్ జనరల్ మరియు ఒకేషనల్ కోర్సుల్లో అడ్మీషన్ పొందిన విద్యార్థుల వివరాలను కళాశాల యాజమాన్యాలు ఫోటో చెక్ లిస్టు ఆప్షన్ ద్వారా “కన్ఫర్మ్” చేయాలని (నిర్ధారించుకోవాలని) జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశానుసారం వెబ్ సైట్(https://tsbie.cgg.gov.in/login.do) ద్వారా విద్యార్థుల ఫోటోలు, సంతకాలు, పుట్టు మచ్చలు, గ్రూపు, మీడియం తదితర వివరాలను సరి చూసుకొని నిర్ధారణ (కన్ఫర్మ్) చేయాలని సూచించారు. కన్ఫర్మ్ చేసిన విద్యార్థుల పేర్లు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించుటకు అనుమతించబడుతాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సం. జనరల్ 4553, ఒకేషనల్ 833 మొత్తం 5386 మంది విద్యార్థులు అడ్మీషన్ పొందారని, అందులో కన్ఫర్మ్ కాని విద్యార్థులు 4301 మంది ఉన్నారని అన్నారు. కావున కళాశాల ప్రిన్సిపాళ్లు/ గ్రూపు ఇంఛార్జ్ లు విద్యార్థుల వివరాలను చెక్ చేసి కన్ఫర్మ్ చేయవలసిందిగా కోరారు. సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్ వెంటనే సరి చూసుకొని పరీక్ష ఫీజుల ప్రక్రియ ప్రారంభించవలసిందిగా ఆదేశించారు.