బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం…
కాపవరం చెరువులో మునిగి మరణించిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..
చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు..
బుధవారం నాడు కాపవరంలోని చిన్నారుల కుటుంబ సభ్యులను కలుసుకుని ప్రమాద ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులు యశ్వంత్,సతీష్ కుమార్ మృతి తనకు చాలా దిగ్ర్భాంతి కలిగించిందన్నారు..
ఇటువంటి సంఘటన మరల పునరావృత్తం కాకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు..