అర్హులందరికీ సంక్షేమ ఫలాలు….
గ్రామాలలో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత…
గాదరాడ గ్రామంలో త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.80 లక్షల రూపాయలు మంజూరు
గాధరాడ లోగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, రాజానగరం ఎమ్మెల్యే
అర్హులైన వారికి పారదర్శకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అందించడం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.
రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాధరాడ గ్రామంలో బుధవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత, స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా తో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు కాకపోతే ఆ వివరాలను ప్రజల నుంచి తెలుసుకొని వారి సమస్యలు పరిష్కారం కోసం రావడం జరిగిందన్నారు.
అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో పూర్తి పారదర్శకత పాటించడంతోపాటు జవాబుదారీ తనం ఉండాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం అన్నారు. అందుకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు రానీ వ్యక్తులకు ఎందుకు రాలేదో వివరించడం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని సంక్షేమ పథకాలను అందించడంలో కుల,మత,వర్గ ప్రాంతాలకు అతీతంగా పథకాల వర్తింపు చేస్తున్నామన్నారు. గాధరాడ గ్రామంలో ప్రభుత్వ పథకాలు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఈ మాధవి లత పాల్గొనడం ఎంతో సంతోషకరమైన విషయంమన్నారు.
జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి గ్రామాల్లో పర్యటించి అర్హత ఉన్న లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఏ కారణం చేత అందటం లేదు అని వాకబు చేయడం గత ప్రభుత్వంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజలతో మమేకమవడం అనేది పరిపాలన విభాగంలో జగనన్న ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలే అందుకు కారణమన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హతనే మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలు అర్హులకు అందించడంలో స్థానిక అధికారులు,ప్రజా నాయకులను భాగస్వాములు చేస్తున్నామన్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందాలి అనే లక్ష్యంతోనే జగనన్న ప్రభుత్వం పని చేస్తుందన్నారు..
గత తెలుగుదేశం ఐదేళ్ల హయాంలో గాదరాడ గ్రామం అభివృద్ధి కోసం 1.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే, మన ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర ఏళ్లలో గాదరాడ గ్రామ అభివృద్ధి కోసం 5.21 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు.
అందులో భాగంగా సచివాలయాల భవనాల నిర్మాణాలు రైతు భరోసా కేంద్రాల భవనాలు,పాల శీతలికరణ కేంద్రాలు వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం,డ్రైన్లు రోడ్ల నిర్మాణం,నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేపట్టడంతో పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.
జలజీవన్ మిషన్ పథకం ద్వారా రెండు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం ఈ గ్రామాల్లో చేపట్టడం జరిగిందన్నారు.
గాదరాడ గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి 80 లక్షల రూపాయలను త్రాగినీటి సమస్య పరిష్కారం కోసం మంజూరు చేయడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ కె మాధవి లత గారు ఎంతో నిబంధనతో పనిచేస్తున్నారని నియోజకవర్గం సంబంధించి ఏ సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిష్కారం మార్గం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అన్నారు.
నియోజకవర్గంలోని అనేక సమస్యలు కలెక్టర్ మాధవి లత గారి చొరవతో పరిష్కారం అయ్యాయన్నారు.
గాదరాడ గ్రామంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ కే మాధవి లత రెండు పర్యాయములు గ్రామంలో ఇళ్ల స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అనువైన నివాసయోగ్యమైన స్థలాలను లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నామని తొందరలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు.
గాదరాడ గ్రామంలో చిర్ల వెంకటలక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ సంక్షేమాల ద్వారా 3,28,480 రూపాయల చేకురిందని జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రతి సంక్షేమ పథకం ఇంటికి అందుతుందని కలెక్టర్ మాధవి లతకు వివరించారు. తమకు ఎన్నో కాలం నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నామని ప్రభుత్వం తరఫున ఇళ్ల స్థలం కేటాయించాలని అడగగా గాదరాడ గ్రామంలో త్వరలోనే అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ కే మాధవి లత బదులిచ్చారు
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కె మాధవి లత గోడ్డు గుర్రమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని ఆమెను పరామర్శించారు.
అనంతరం అంగన్వాడి భవనంలో నిర్వహించిన గర్భిణీ స్త్రీలకు సీమంత కార్యక్రమంలో పాల్గొని పౌష్టిక ఆహారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కర్రీ నాగేశ్వరావు మండల కన్వీనర్ ఆడపా కనకరాజు,బొండడా చందు, ఆరుబోలు చిన్నబాబు చిర్ల శివ, డాక్టర్ శ్రీను,డాక్టర్ శివ, చిర్ల రాంబాబు తోరాటి శ్రీను,నాగ విష్ణు తదితరులు పాల్గొన్నారు