18 వయసు దాటిన యువత ఓటరుగా నమోదు కావాలి: జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి

*18 వయసు దాటిన యువత ఓటరుగా నమోదు కావాలి: జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి*

*తిరుపతి*

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల సవరణ -2023 కార్యక్రమంలో భాగంగా ఓటరు అవగాహన, ఓటర్ల నమోదుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా నేడు ర్యాలీలు నిర్వహించడం జరుగుతున్నదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు. తిరుపతి పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు బుధవారం నిర్వహించిన ఎన్నికల కమిషన్ స్వీప్ కార్యక్రమ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల శాతం పెంచుదాం అనే నినాదంతో నేడు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, 18 సంవత్సరాలు వయసు దాటిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలన్నారు. చదువుకున్న యువత అయితే ఓటు హక్కును సక్రమంగా వినియోగించి కావలసిన నాయకున్ని ఎన్నుకో కలుగుతారని అన్నారు. జిల్లాలో అన్ని కళాశాలలో 18 వయసు దాటిన యువత నమోదు చేసుకోవాలని అవగాహన సదస్సులు నిర్వహించామని అన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన, ఓటరుగా నమోదుకు అవకాశం వంటి కార్యక్రమాలు ప్రకాశం పార్క్ లో కూడా నిర్వహించామని అన్నారు. ర్యాలీ అనంతరం మానవహారం, తిరుపతి నియోజకవర్గంలోని 265 మంది బి.ఎల్.ఓలతో సమీక్ష నిర్వహించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ శ్రీనివాసరావు, నగరపాలక డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, అర్బన్ తహసిల్దార్ వెంకటరమణ, ఈడిటి విజయభాస్కర్, డిటి శ్యాంమోహన్, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు, విధ్యార్థులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!