*జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు..*
– జిల్లా వ్యాప్తంగా కదలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు
– విద్యా సామాగ్రితో ఎమ్మెల్యే చెవిరెడ్డికి సత్కారం
– అభిమానులను ఆకట్టుకున్న ప్రత్యేక పాటలు
జన హృదయ నేత, ప్రభుత్వ విప్ , చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆయన స్వగ్రామం తుమ్మలగుంట వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, అధికారుల రాకతో కిక్కిరిసి పోయింది. తిరుపతి జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, అభిమానులు, కుటుంబ సభ్యుల నడుమ ఎమ్మెల్యే చెవిరెడ్డి కేక్ కట్ చేశారు. భారీ గజమాలలతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయా కాలనీల వార్డు మెంబర్లు, సర్పంచ్ లు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల నేతలు ప్రత్యేకంగా సన్మానించారు. పుష్ప గుచ్చం, శాలువలకు బదులుగా పూల మొక్కలు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగులను అందించారు. చెవిరెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అన్న నినాదాలతో నివాస ప్రాంగణం జన సందడిగా మారింది. కాగా తన పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, అభిమానులు శ్రేయోభిలాషులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజనం, స్వీట్లు పంపిణీ చేశారు.
*ఎక్కడికక్కడ ఎమ్మెల్యే చెవిరెడ్డి జన్మదిన వేడుకలు..*
చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి జన్మదిన వేడుకలను నియోజక వర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద 50 కేజీల భారీ కేక్ కట్ చేయగా పేరూరు, తుమ్మలగుంటలో రక్తదానం చేశారు. అదేవిధంగా తిరుచానూరులో పేదలకు అన్నదానం, బట్టలు పంపిణీ చేశారు. పాకాల, ఆర్సీపురం, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారి పాళెం మండలాల్లోని మండల పార్టీ నేతలు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులు ఎమ్మెల్యే చెవిరెడ్డి నివాసానికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు.
*విద్యా సామాగ్రితో ఎమ్మెల్యేకు సత్కారం*
ఎమ్మెల్యే చెవిరెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారంతా పుష్ప గుచ్చాలు, శాలువలకు బదులుగా పేద విద్యార్థుల చదువులకు ఉపయోగపడే విద్యా సామాగ్రిని తీసుకువచ్చి అందించారు. వినూత్నమైన పద్దతిలో విద్యా సామాగ్రితో ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఘనంగా సత్కరించటం సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.
*అభిమానులను ఆకట్టుకున్న పాటలు*
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అభిమానంతో వైఎస్ఆర్ నేతలు నెమ్మలి పార్థసారథి రెడ్డి, యద్దల నరేంద్రరెడ్డిలు ప్రత్యేకంగా రూపొందించిన పాటలు అభిమానులు అందరినీ ఆకర్షించాయి. *”చంద్రగిరి చందురుడు.. చెవి భాస్కరుడు.. చైతన్యమే పెంచే రేపటి సూర్యుడు”* అంటూ వచ్చిన పాటకు జనం నుంచి విశేష స్పందన లభించింది.