జర్నలిస్ట్ కృష్ణపల్లిసురేష్:-ప్రభుత్వమే స్వయానా అష్రఫ్ సేవలను గుర్తించి అవార్డులు ,రివార్డులతో సత్కరించింది కానీ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాధికారి ఒంటెద్దు పోకడలతో అష్రఫ్ ని సస్పెండ్ చేశారు. కాగజ్ నగర్ జూనియర్ కళాశాల లో జరిగిన కుంభకోణం జిల్లాలో జర్నలిస్టులకు ఇచ్చిన అక్రిడేషన్ లు ఇచ్చిన అక్రమాలపై ఆర్టీఐ అప్లికేషన్లు వేసి ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు అష్రఫ్. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డిఐఈఓ డిపిఆర్ఓ. అష్రఫ్పై. ఉన్నతాధికారులకు పిర్యాదు చేసారు దీనితో అష్రాఫ్ ను సస్పెండ్ చేశారు. అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేయాల్సిందిపోయి తనపై చర్యలు ఎలా తీసుకుంటారు అని ఆశ్రఫ్ ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీఐ ఆక్ట్ పై మరియు సర్వీస్ రూల్స్ పై శిక్షణ తరగతులను అష్రఫ్ తో ఇప్పిస్తుంది అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వయానా అష్రఫ్ సేవలను గుర్తించి అవార్డులు ,రివార్డులతో.సత్కరించింది.కానీ జిల్లా విద్యాధికారి ఒంటెద్దు పోకడలతో అష్రఫ్ ని సస్పెండ్ చేశారు ఈ సందర్భంగా బాధితుడు అష్రాఫ్ మాట్లాడుతూ నా సస్పెన్షన్ పై డీఈఓ.ఎలాంటి పత్రిక ప్రకటన జారీ చేయకున్నా డీపీఆర్ఓ.కృష్ణ మూర్తీ కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ఆరోపణలతో డీఈఓ. పేరుతో పత్రిక ప్రకటన జారీ చేసి ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను కూడా తప్పు దోవ పట్టిస్తూ, దమన నీతిని ప్రదర్శించడం సిగ్గుచేటా.. కాదా.. అని బాధితుడు అష్రాఫ్ ఆవేదన వ్యక్తంచేశారు జిల్లాలో అవినీతి అక్రమాలను ప్రశ్నించిన పాపానికి నన్ను ఉపాధ్యాయుడి వృత్తిలో నుండి సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉన్నత అధికారుల పై పైస్థాతి అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను అవినీతి అక్రమాల లోబడి నుంచి కాపాడి తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు అష్రాఫ్ కన్నీటి పర్యంతంతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చారు.