భక్తజన సంద్రంగా మహానంది పుణ్యక్షేత్రం
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 07, మహానంది:
మహానంది క్షేత్రంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తజనంతో కిటకిట లాడుతుంది. తెల్లవారుజామునే భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి, మహానందిశ్వర స్వామివారిని దర్శించు కున్నారు. దర్శనం అనంతరం స్వామి వారి రుద్రాభి షేక ములను ,కేదారేశ్వర స్వామి నోములను నిర్వహిం చుకున్నారు.ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట, ధ్వజస్తంభం, నంది స్తూపం వద్ద కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.