భూస్వాముల ఆక్రమించిన ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి-సిపిఐ.
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 07, మహానంది:
మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో పొలిమేరకు చెందిన 4459 ఎకరాల వ్యవసాయ భూములను, ప్రభుత్వ భూములను,బడా భూస్వాములు అధికార పార్టీనాయకుల అండ దండలతో ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తుంటే స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం దుర్మార్గమని వెంటనే ప్రభుత్వ అధికారులు ఆ భూముల గుర్తించి స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ మల్లికార్జునకు ఆర్జిలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. ఎస్. బాబా ఫకృద్దీన్. పాల్గొన్నారు అని సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఆర్.సామేలు తెలిపారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శిఎన్. రంగనాయుడు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూములు బడా భూస్వాములు ఆక్రమించుకొని పేదలకు దక్కకుండా వారి స్వలాభాలకోసం ఆక్రమించుకొని. అనుభవిస్తుంటే జిల్లా ప్రభుత్వ యంత్రాంగమం నిమ్మకు నిరేత్తి నట్టు ఉండడము విచారకరమని విమర్శించారు. మహానంది మండలంలో అటవీ బంజరు ప్రభుత్వ భూములు అవినీతి రెవెన్యూ అధికారుల పోద్బలంతో పట్టాలు చేసుకున్నారని వాటిని గుర్తించి పేదలకు ఇవ్వాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో స్థానిక మండల అధికారులకు విన్నవించిన చెవిటోడు ముందర శంఖం ముదిరితే ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు జిల్లా స్థాయిలో పాటు మహానంది మండలంలో కూడా ప్రభుత్వ భూములను గుర్తించి సాగు.ఇంటి స్థలాలకు ఇవ్వాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో గుర్తించిన భూములను స్వాధీనం చేసుకొని అర్హులైన నిరుపేదలకు పంచుతామని పై నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులతో పాటు బుక్కాపురం గ్రామ ప్రజలు సుగుణమ్మ. సుభాన్, నబిరసూల్, లక్ష్మీబాయి, ఈశ్వరమ్మ, సుగుణ బాయ్, తదితరులు పాల్గొన్నారు.