జర్నలిస్ట్ కృష్ణపల్లిసురేష్:-కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ కశాలలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఆయన శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉదయం కశాళాలకు వచ్చి సాయంత్రం వరకు భోజనం లేకుండా ఉండడంవల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అజయ్‌కుమార్ , ఎం పీపీ ముండే విమలాబాయి, జిల్లా డీఐఈఓ శ్రీధర్ సుమన్, సీఐ శ్రీనివాస్, ఎస్సై డీకొండ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.