రైతుల అభివృద్ధికి అటవీశాఖ ప్రత్యేక విభాగం కృషి
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 05, మహానంది:
రైతుల అభివృద్ధికి అటవీ శాఖ ప్రత్యేక విభాగం కృషి చేస్తున్నట్లు మహానంది మండలం అటవీశాఖ డిఆర్ఓ సుబ్బయ్య శనివారం పేర్కొన్నారు. మహానంది మండలం తిమ్మాపురం బీట్ పరిధిలోని గ్రామాల్లోని తిమ్మాపురం, అభిపురం బొల్లవరం, తమ్మడపల్లె తదితర గ్రామాల్లో రైతుల్లో అవగాహన సదస్సును అటవీ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార రథం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.నంద్యాల జిల్లా అటవీ శాఖ రేంజర్ శివన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు అటవీశాఖ వన్యప్రాణి విభాగం వారు పచ్చదనం పర్యావరణం అభివృద్ధిలో భాగంగా మహానంది, గాజులపల్లి, బండి ఆత్మకూరు, ఈర్నపాడు, రుద్రవరం, అహోబిలం, తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా నర్సరీలను ఏర్పాటుచేసి మొక్కల పెంపకం చేపట్టడం జరిగిందన్నారు.నర్సరీ నందు కానుగా నేరేడు బాదం ఉసిరి చింత జామ నిమ్మ వెలగా మొదలగు పల సహాయ సహాయం మొక్కలతోపాటు టేకు,ఎర్రచందనం ,జిత్రేగి తదితర ఆర్థికపరమైన మొక్కలను పెంచడం జరిగిందని వాటిని రైతులకు ఉచితంగా అందజేస్తామని తెలిపారు.రైతుల యొక్క పొలం గట్ల వెంబడి మరియు అంతర పంటల్లో భాగంగా వీటిని పెంచుకోవడానికి ఉచితంగా అటవీ శాఖ సరఫరా చేస్తుందని తెలిపారు. అంతర పంటల్లో భాగంగా కంది మొక్కజొన్న వేరుశెనగ మొదలగు పంటల సాగు సమయంలో వన్యప్రాణుల వలన ఏమైనా నష్టం జరిగితే అటవీ శాఖ విధి విధానాల ప్రకారం పంట నష్టం ను అంచనా వేసి పరిహారం అందజేయడానికి నిబంధనల మేరకు అటవీశాఖ కృషి చేస్తుందన్నారు. వన్య ప్రాణుల వలన రైతులకు ఏమైనా ప్రమాదం సంబంధించిన ఎడల వారికి వైద్య ఖర్చులు మరియు తగిన ఆర్థిక సహాయ సహకారాలు అటవీ శాఖ అందజేస్తుందన్నారు. పంట నష్ట పరిహారం మరియు రైతులు వన్యప్రాణాల నుండి ప్రమాదంలో దెబ్బతిన్న సమయంలో నంద్యాల అటవీ శాఖలోని వన్యప్రాణ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. రైతులు పొలం గట్ల వెంట మొక్కలను పెంచడం వల్ల భూమి కోతకు గురి కాకుండా ఉంటుందని ఇది రక్షణ వలయం కూడా అవుతుందని డిఆర్ఓ సుబ్బయ్య రైతులకు బొల్లవరం గ్రామంలో పేర్కొన్నారు రైతులు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు అటవీ శాఖకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాల కోసం నంద్యాలలోని అటవీ సంరక్షణ వన్యప్రాణి విభాగాన్ని .సంప్రదించవచ్చు తెలిపారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.