అయిజకు పాకిన న్యూడ్ కాల్స్ వ్యవహారం
అయిజ: జోగులాంబ గద్వాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన న్యూడ్ కాల్స్ వ్యవహారంపై అయిజ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుత జిల్లా కేంద్రమైన గద్వాలలో అమ్మాయిలను లోబరుచుకుని వీడియో కాల్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో ఇలాంటి బాధితులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్. ఐ నరేష్ కుమార్ పేర్కొన్నారు. ఆడపిల్లలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.