అప్పు కిందికి రెండు ఎకరాల భూమి మాయం

అప్పు కిందికి రెండు ఎకరాల భూమి మాయం అయినా ఘటన మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. జూలపల్లి గ్రామానికి చెందిన అనురాధ(35) భర్త అంజయ్య వృత్తి వ్యవసాయం 2021 సంవత్సరంలో మా మామయ్య భాస్కర్ రెడ్డి తండ్రి సత్తిరెడ్డి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. వీరి దగ్గర 3 ,70,00 రూపాయలు రెండు ఎకరాల భూమి పాసుబుక్కులు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. మేము పేదరికంలో ఉన్నందువలన అప్పు తీర్చలేకపోయాము. అదే అలుసుగా తీసుకొని మా మామయ్యకు మాయమాటలు చెప్పి 2021 ఆగస్టు నెలలో రెండు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎందుకు మామయ్య సంతకాలు చేశావు అని అడగగా ఆరోజు రాత్రి బలవంతంగా నాతో సంతకాలు పెట్టించారని మా మామయ్య తెలిపారు. భాస్కర్ రెడ్డి పై మేము మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఫిర్యాదు తీసుకోకపోవడం గమనార్ధం. అలా కాకుండా భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయగా మాపై కేసు నమోదు చేశాడనీ ఆరోపించింది. మాకు న్యాయం చేయాలని ఎస్పీకి శనివారం ఫిర్యాదు చేసి వేడుకుంది.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!