ఆలయ అభివృద్ధికి సహకరించండి
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్04, మహానంది:
మహానంది దేవస్థాన అభివృద్ధికి సహకరించాలని శుక్రవారం ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్టు బోర్డు ఛైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి కోరారు. కర్నూలు జిల్లా మాజీ మంత్రి టీజీ వెంకటేష్,తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లను, వారి నివాసాలలో ఆలయ అభివృద్ధికి తమ వంతుగా సహకరించాలని కోరారు.వారు సానుకూలంగా స్పందించి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామి వారి జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ ఎర్రమల మధు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ధర్మకర్త బుసకాని వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.