చికిత్స పొందుతూ మహిళా మృతి
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్03, మహానంది:
మహానంది మండల పరిధిలోని యు. బొల్లావరం గ్రామంలో పురుగుల మందు తాగి సురేఖ (28) అనే వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈమెను వారి కుటుంబికులు వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మెరుగైన వైద్యం కొరకు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కుటుంబ సమస్యల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.ఈమెకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.