పేదలకు చెందవలసిన అక్రమగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
అంబేద్కర్ కొనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ,ఆలమూరు మార్గం మధ్యలో కళ్యాణ చక్రవర్తి వెంకట సాయి కాటాకు సమీపంలో రాజమహేంద్రవరం రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు,విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ పివి రవికుమార్ ఆదేశాలతో బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ 37 టిడి 1111 నెంబరు గల మినీ వ్యాన్లులో రవాణా చేస్తున్న పేదలకు అందవలసిన అక్రమంగా తరలిస్తున్న 10.500 మెట్రిక్ టన్నుల గల రేషన్ బియ్యాన్ని స్వాధీనపరచుకున్నట్లు విజిలెన్స్ సీఐ వై సత్యకిషోర్ తెలియజేశారు.ఆయన తెలియజేసిన కథనం ప్రకారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పవిత్ర కుమార్ వివిధ తూనికులు రంగులు కలిగిన 280 బస్తాల్లో రేషన్ బియ్యాన్ని డ్రైవర్ కడిమి వెంకటేశ్వరరావు సహాయంతో కాకినాడ జిల్లా పోర్టుకు తరలిస్తున్నారని దీని విలువ సుమారుగా 8 లక్షల రూపాయలు విలువ ఉంటుందని ఆయన తెలియజేయగా ఆలమూరు ఇంచార్జ్ ఎమ్ఏస్ఓ ఇస్మాల్ స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్ఐ ఎస్.శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు._*