మహానందీశ్వరుని సేవలో విశ్రాంత డిప్యూటీ కమిషనర్ శివాజీ
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 04, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని శుక్రవారం విశ్రాంత డిప్యూటీ కమిషనర్ శివాజీ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. వీరికి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు అభిషేకం, కుంకు మార్చన తదితర పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం శేష వస్త్రాంతో సత్కరించి,వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.