104 వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి

104 వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి

స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 25, మహానంది:

మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలోని 104 వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోనేలా గాజులపల్లి పిహెచ్సి వైద్యురాలు ఎస్తేర్ వందన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు 104 వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.104 వాహనాల్లో ప్రజలకు అవసరమైన బీపీ, డయాబెటిస్ పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తామన్నారు.గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నా మని ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో 104 వైద్యాధికారిని భవ్య, ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!