తుమ్మలగుంటలో…
*అట్టహాసంగా నరకాసుర వధ*
తిరుపతి జిల్లా చంద్రగిరి
* 20 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు
* ఆకట్టుకున్న తారాజువ్వల వెలుగులు
* భారీగా తరలివచ్చిన జనం
* ఏర్పాట్లు పర్యవేక్షించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
దీపావళి, నరక చతుదర్థశి పర్వదినాన్ని పురస్కరించుకొని తుమ్మలగుంట గ్రామంలో సోమవారం సాయంత్రం 7 గంటలకు నరకాసుర వధ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కన్నుల పండువుగా సాగిన వేడుకలను కళ్ళారా తిలకించేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జనంతో నిండింది. 20 అడుగుల నరకాసుర ప్రతిమకు సుమారు 2 లక్షల ఠపాకాయలు అమర్చడంతో బాణా సంచా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షనగా నిలిచాయి. తుమ్మలగుంట నరకాసుర వధ వేడుకలను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రత్యేక పూజలు అనంతరం నరకాశుర వధ వేడుకలు ప్రారంభమైనప్పటికీ, రాత్రి 7.30 గంటలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతులు మీదుగా నరకాసుర ప్రతిమకు నిప్పంటించారు. ఆ తర్వాత తారా జువ్వల బాణాసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రతిమ దగ్ధమవుతున్న సందర్భంలో ఠపాకాయల పేలుళ్లకు వీక్షకులు కేరింతలు కొట్టారు. తమసెల్ ఫోన్లతో ఆ దృశ్యాలను బంధించారు. జనసందోహాన్ని దృష్టిలో పట్టుకుని భారీ కేడ్లు ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలలో ఎంఆర్ పల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ జాం కాకుండా వాహనాలను మళ్లించారు. వేడులకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు.