*మాస్టర్ ప్లాన్ రోడ్లపై సమీక్ష సమావేశం*
*తిరుపతి*
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం మేయర్ డాక్టర్ శిరీష, కమీషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ మాస్టర్ ప్లాన్ రోడ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులపై సమన్వయం కొరకు సంభందిత కార్పొరేటర్లను మాస్టర్ ప్లాన్ రోడ్స్ సమన్వయ కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ రోడ్లే మన ప్రధాన ఎజెండాగా పనులు జరగాలని చర్చించారు. తిరుపతి నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేయడంతో జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్.కె. బాబు, తమ్ముడు గణేష్, నరసింహాచారి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, కోటూరు ఆంజనేయులు, అమర్నాథ్ రెడ్డి, తిరుపతి మునిరామి రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఇమామ్, శ్రీదేవి, వెంకట రెడ్డి, టౌన్ బ్యాంకు చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి, అడిషనల్ కమీషనర్ సునీత, అసిస్టెంట్ సిటి ప్లానింగ్ ఆఫీసర్లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.