పెద్దమ్మతల్లి దేవాలయంలో చైర్మన్ ధర్మకర్తలుగా గిరిజనులను కేటాయించాలి:………
గిరిజన సంఘాల నాయకులు
పాల్వంచ మండలం:
అక్టోబర్17:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ జగన్నాధపురం పెద్దమ్మతల్లి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ధర్మకర్తలుగా గిరిజనులను నియమించాలని గిరిజన సంఘల నాయకులు డిమాండ్ చేశారు పాల్వంచ మండలంలో జగన్నాథపురం పెద్దమ్మతల్లి దేవాలయంలో చారిత్రాత్మక దేవాలయము అని చైర్మన్ మరియు ధర్మకర్తలుగా గిరిజనులను నియమించాలని అన్నారు భారతరాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నది అదేవిధంగా పీసా చట్టం అమలులో ఉన్న జగన్నాథపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది కానీ గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా గిరిజనేతరులకు చైర్మన్ ధర్మకర్తలుగా విరుద్ధంగా నియమించడం జరిగిందని అన్నారు భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు పీసా చట్టానికి విరుద్ధం కావున భారత రాజ్యాంగం 5 షెడ్యూలు ప్రకారం గిరిజన ప్రాంతంలో 100శాతం స్థానిక ఎస్టి గిరిజనులకే చైర్మన్లు ధర్మకర్తలుగా అవకాశం ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అద్యక్షుడు బానోత్ రమేష్ నాయక్ జిఎస్ఎస్ రాష్ట్ర నాయకులు బాడిశ బిక్షంజిఎస్ఎస్ యువజన నాయకులు అరెం ప్రాశాంత్ సేవాలాల్ సేన పాల్వంచ మండల అద్యక్షుడు గుగులోత్ భద్రు నాయక్ పాల్వంచ గిరిజన జేఏసీ చైర్మన్ దర్మసోత్ ఉపెందర్ బహుజన పూజారుల వ్యవస్థాపక అద్యక్షుడు బాబురావు నాయక్ సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి బాదావత్ శ్రీను మండల ప్రదాన కార్యదర్శి రమేష్ మండల యువసేన అద్యక్షుడు బానోత్ కుమార్ జిల్లా మీడియా కన్వీనర్ భుక్య రమేష్ మండల కార్యదర్శి కిషన్ పెసా కమిటీ సభ్యులు రమేష్ కుమార్ తదితరులు పాల్గోన్నారు