నిఖిల్ నాయక్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి…..
గోపి రాథోడ్ జడ్చర్ల నియోజకవర్గం: అక్టోబర్17: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం సేవాలాల్ సేన రాష్ట్ర ఇంచార్జ్ గోపి రాథోడ్ ఆధ్వర్యంలో నిఖిల్ నాయక్ హత్యకు కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల మండలం స్థానిక ప్రభుత్వ గిరిజన బాలురు వసతి గృహమున సేవలాల్ సేన ఆధ్వర్యంలో నిఖిల్ నాయక్ ను నివాళులు అర్పించడం జరిగిందని నిఖిల్ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అతని హత్యకు కారకులైన నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలని అధికారులకు సేవాలాల్ సేన ఇంచార్జ్ గోపి రాథోడ్ డిమాండ్ చేశారు. హత్య జరిగిన కొన్ని రోజులు అవుతున్న ప్రభుత్వాలు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం చాలా బాధాకరం అని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జడ్చర్ల ఇన్చార్జి పవన్ నాయక్ మండల యూత్ ప్రెసిడెంట్ విష్ణు నాయక్ సందీప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.