గడపగడపకు సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్16, మహానంది:
ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.మహానంది మండల పరిధిలోని మహానంది గ్రామంలో ఆదివారం రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలోని పలు కాలనీలలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలను, నవరత్నాల పథకాల పై ప్రజలకు అవగాహన కలిపిస్తు.ఏ ఇంట్లో ఏ ఏ పథకాల ద్వారా ఎంత మేర లబ్ది పొందారో లబ్దిదారులకు వివరించారు. జగనన్న ప్రభుత్వ సంక్షేమం గురించి ప్రజలకు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేస్తున్న సంక్షేమ పథకాల బుక్ లెట్ను వారికి అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ తాను రెండు రోజులుగా మహానంది గ్రామంలో ప్రతి గడప గడపకు పర్యటిస్తున్నానని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలుపుతున్నారని అన్నారు.ప్రతి మహిళను పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అని అధికారులను ఆదేశించారు. అనంతరం మహానంది రైతు భరోసా కేంద్రంలో ప్రభుత్వం నుంచి మంజూరైన సబ్సిడీ ట్రాక్టర్ ను రైతులకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, మండల వైసీపీ కన్వీనర్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని, ఎంపీడీవో శివ నాగజ్యోతి, సర్పంచి చలం చలం శిరీష, మాజీ మండల ఉపాధ్యక్షురాలు భూమా శ్రీవాణి, భూమా సుబ్బరామయ్య,వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసిపి కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.