చీకటి మా బోయ బ్రతుకుల్లో వెలుగునింపండి
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 16,మహానంది:
అరవై ఆరు సంవత్సరాలుగా పాలకుల చేతిలో మోసపోయి చీకట్లో మా బ్రతుకులు వెళ్లదీస్తున్నామని 1956 ముందు ఆంద్రప్రదేశ్ బోయలు ఎస్టీ లుగా పరిగణింపబడేవారని కానీ అప్పటి ముఖ్యమంత్రి మమ్మల్ని ఎస్టీలుగా తొలగించి మోసం చేశారని అప్పటినుండి ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాన్ని ప్రాదేయపడుతూనే ఉన్నామని మమ్మల్ని నమ్మండి మేము అధికారంలోకి వస్తే కచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తామని గద్దెనెక్కగానే మా సమస్యను పట్టించుకోవటం లేదని,మీరు ఎన్నికలముందు మేము అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. 3.5సంవత్సరాలు గడిసినా కూడా మా సమస్యకు పరిస్కారం దొరక లేదని మీరు మాటాయిస్తే తప్పరని అంటుంటారని కాబట్టి సలహాదారుల మాటలు వినకుండా మీరు మా విన్నపాన్ని ఇప్పటికైనా మన్నించి కేంద్రాన్ని ఒప్పించేందుకు పార్లమెంట్ సభ్యులద్వారా ప్రధానిని కలిసి పార్లమెంట్లో ఆమోదింప జేసీ మా చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపుతారని ఆశిస్తూ మా ఈ వేదనను క్రొవ్వొత్తులు వెలిగించి నిరసనను తెలియ జేస్తున్నామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి తెలిపారు.శనివారం రాత్రి శ్రీశైల నియోజకవర్గం మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో బోయలలో చీకటి తొలగించి వెలుగు నింపండి సీఎం అంటూ దాదాపు ఓ గంటపాటు క్రొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిరిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండన్న,రాష్ట్ర కార్యదర్శి పరమటూరి శేఖర్,నంద్యాల జిల్లా విఆర్పీఎస్ అధ్యక్షులు మీనిగ నారాయణ,శ్రీశైల నియోజకవర్గ అధ్యక్షులు బూపని వెంకటేశ్వర్లు,జిల్లానాయకులు రమణ,మండల పుల్లయ్య,రామకృష్ణ,మండల నాయకులు జయరాం తదితరులు పాల్గొన్నారు.