గోశాలను సందర్శించిన అగ్రికల్చర్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 16, మహానంది:
మహానంది మండలం గోపవరం గ్రామంలోని గోశాలను రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు మరియు రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డి, ఆదివారం సందర్శించారు. గోశాలలోని గిర్ ఆవులు,దేశి ఆవులు, దూడలను అక్కడ పాడి పరిశ్రమ సాగు విధానాన్ని పరిశీలించారు.వాటి పోషణ, పాల దిగుబడి వివరాలను గోశాల నిర్వాహకులు డాక్టర్ శేష ఫని వివరించారు.గోశాల సమీపంలోని ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేస్తున్న అరటి,నిమ్మ, మామిడి, పసుపు, పంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులందరూ ఈ పద్ధతులలో పంటలను సాగు చేయాలన్నారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అక్కడి రైతులతో మాట్లాడుతూ పాడి, పంటలు రెండు ఉంటే వ్యవసాయం సులభ దాయకం మరియు లాభదాయకం అవుతుందని తెలియజేశారు. రసాయన ఎరువులు వాడకం తగ్గించి ,ప్రకృతి వ్యవసాయం పాటించాలని రైతులకు వివరించి.రైతులతో వారి సమస్యలపై చర్చించారు. అనంతరం గోశాల నిర్వాహకులు డాక్టర్ శేష ఫని మాట్లాడుతూ రైతు, దేశం బాగుండాలంటే ప్రగతి వ్యవసాయం వైపు రావాలనీ, ఫెర్టిలైజర్లు,రసాయనిక ఎరువులు వాడటం వలన భూమిలోని జీవ సమతుల్యత దెబ్బతింటుందని అలా కాకుండా సేంద్రీయ ఎరువులు వాడటం వలన జీవరాశులకు ఎటువంటి హాని జరగదని సూచించారు. దేశి ఆవుల మూత్రం ద్వారా భూములకు విపరీతంగా సారం చేకూరుతుందని మరియు దేశీ వాలి విత్తనాల ద్వారా పంట భూమి దిగుబడి పెరగడంతో పాటు భూమి సారవంతమవు తుందని తెలిపారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలను పండించుకొనుట ద్వారా మానవాళి ఆరోగ్యాన్ని, పర్యావరణం కాలుష్యం కాకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి చంద్రశేఖర్ రెడ్డి, ఉద్యాన సహాయకురాలు హరిత, వ్యవసాయ సహాయకుడు లక్ష్మి కాంత్, పశుసంవర్త శాఖ సహాయకురాలు అనురాధ, గ్రామ రైతులు పాల్గొన్నారు.