స్టూడియో10 టీవీ అక్టోబర్ 08
మహర్షివాల్మీకి జయంతి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం
వాల్మీకి బోయలను ఎస్టీలలో పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వాల్మీకి జయంతి ఉత్సవాలలో వాల్మీకులు ఎవ్వరూ కూడా పాల్గొనకూడదని అందరూ అధికారిక కార్యక్రమాన్ని బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహర్షి వాల్మీకి జయంతిని ప్రతీఏటా ఘనంగా నిర్వహించుకుంటామో అలాగే ఊరూరా, ప్రతి ఇంటా వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో మాత్రం ప్రజా ప్రతినిధులు, వాల్మీకి కుల పెద్దలు, వాల్మీకి బోయలు ఎవరూ పాల్గొనకుండా మన నిరసనను తెలియజేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం నిర్వహించే వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ వాల్మీకి గిద్దలూరు సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. వాల్మీకి మాభివందనాలతో…
జై వాల్మీకి! జై జై వాల్మీకి!!
వాల్మీకి గిద్దలూరు సంక్షేమ సంఘం