సూర్యాపేట జిల్లా, అక్టోబర్ 8, నడిగూడెం మండలం ప్రభుత్వ వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని త్రిపురవరం ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ లక్ష్మి ప్రసన్న సూచించారు. నడిగూడెం మండలం కేశవాపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ విజయ భవాని కి శుక్రవారం సాయంత్రం పురిటి నొప్పులు రావడం తో ఆమె కుటుంబ సభ్యులు త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు తీసుకొని వచ్చారు. అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు శనివారం ఉదయం 3 గంటల 12 నిమిషాలకు కాన్పు నిర్వహించారు. విజయ భవాని మొదటి కాన్పులో సాధారణ ప్రసవం ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ.. సాధారణ కాన్పు వల్ల మహిళలకు ఎన్నో లాభాలు ఉన్నాయని, గర్భిణీ స్త్రీలు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ ప్రసవం సులభంగా అవుతుందన్నారు. ప్రభుత్వం హాస్పిటల్ పై నమ్మకం తో రావాలని ఆమె సూచించారు. విజయ భవాని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. రాత్రి సమయంలో అందుబాటులో ఉండి సాధారణ కాన్పు చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ రత్న మేరీ, ఆరోగ్య కార్యకర్తలు గీత, రమాదేవి, కిరణ్,మంగ,మహేశ్వరి, సువర్ణ, ఆశా కార్యకర్త శుక్లావతి తదితరులు ఉన్నారు.