స్టూడియో10 టీవీ అక్టోబర్ 08
9న వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు తెలిపారు 09, 10, 2022 సాయంత్రం 4 గంటలకు గిద్దలూరు తహసీల్దార్ ఆఫీస్ ఆవరణంలో ఉన్న విశ్రాంత ఎన్జీవో సంఘం ఆఫీస్ నందు వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణము ప్రపంచానికి ఆదర్శమైందన్నారు రామాయణం అనే గ్రంథము అందరికీ సంబంధించినది కాబట్టి పుట్టింది వాల్మీకి సంఘంలో అయినా ఆయన కారణజన్ముడు ప్రతి సంవత్సరం ఆ ఆశ్వీయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారన్నారు. ప్రపంచ స్థాయిలో చరిత్ర కలిగినటువంటి వాల్మీకి మహర్షిని మనందరం అతీతంగా అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత సమాజంపై ఉంది గిద్దలూరు పరిసర ప్రాంత ప్రజలు వాల్మీకి సంఘం వారు అధికంగా పాల్గొని వాల్మీకి జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. వాల్మీకి మహర్షి సాహిత్యంలో ఆరితేరినటువంటి మహానుభావులు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని క్షుణ్ణంగా వాల్మీకి మహర్షి చరిత్ర గురించి తెలియజేస్తారు. ఈ సమాచారాన్ని ఎక్కువమందికి అందించండి అందరం పాల్గొని విజయవంతం చేద్దాం.