పెనుగంచిప్రోలు గ్రామంలో గ్యాస్ కంపెనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భక్తుల ప్రసాద్ తీవ్రగాయాలతో మృతి చెందటం ప్రాంత వాసులలో ఒక్కసారిగా విషాదచయాలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన తుఫాను కాలనీ వాసి బత్తుల ప్రసాద్ (వయసు 23) చెక్క సెంట్రింగ్ కార్మికుడు. ఇతనికి ఒక బాబు ఒక పాప. ఇతను రోజు చెక్క సెంట్రింగ్ కు వెళుతూ కుటుంబాన్ని నడుపుతున్నాడు.తన భార్య ఇటీవల డెలివరీ అయిన సందర్భంగా వత్సవాయిలో ఉండడం వలన రోజు పనికి స్వగ్రామం వచ్చి, పని ముగించుకొని సాయంత్రానికి వత్సవాయి తన భార్య పిల్లలను చూసుకోవటానికి వెళుతూ ఉండేవాడు.యదావిదిగా తను గురువారం రాత్రి.9.మరియి 9:30 సమయంలో వత్సవాయి వెళుతున్న నేపథ్యంలో పెనుగంచిప్రోలు నుండి మక్కపేట వెళ్లే మార్గంలో గ్యాస్ కంపెనీ వద్ద ఎదురుగా వస్తున్న రాంకో ట్రస్ట్ స్టైల్ బస్సు ఢీకొట్టడంతో పల్సర్ బైక్ మీద వెళుతున్న ప్రసాద్ కాలికి,పొట్ట కింద ప్రెవేట్ బాగాలకు బలంగా దెబ్బలు తగిలాయి.ఈ నేపథ్యంలో కాలు మోకాలి కింది భాగం తెగి పడి పోయింది. ఆ సమయంలో 108 ని సంప్రదించి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలిసిన పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరి ప్రసాద్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గతంలో కూడా ఇదే రాంకో బస్సు మూలనా పెనుగంచిప్రోలు ముళ్లపాడు మార్గమధ్యలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ విషయమై కూడా గ్రామవాసులు రాంకో ట్రస్ట్ స్టైల్ బస్సు నడిపిన వ్యక్తి మీద యాజమాన్యం మీద తగు చర్యలు తీసుకోవాలని, బాత్రుల ప్రసాద్ కు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.