పోలీస్ సర్కిల్ కార్యాలయం కొరకు అన్వేషణ
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్07, మహానంది:
నంద్యాల రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయం కొరకు అన్వేషణ ప్రారంభం అయినట్లువిశ్వసనీయ సమాచారం.నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోస్పాడు ,బండి ఆత్మకూరు,మహానంది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.వీటన్నిటికీ కేంద్రంగా ప్రస్తుతం నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవరణలో నంద్యాల రూరల్ సర్కిల్ కార్యాలయం కొనసాగుతుంది.నూతనంగా నంద్యాల జిల్లా ఏర్పడడంతో పాటు సర్కిల్ కార్యాలయం మార్పు కోసం అన్వేషణ లో భాగంగా మహానంది పోలీస్ స్టేషన్ ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. కొందరు బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కేంద్రంగా సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.మరికొందరు గోస్పాడు పోలీస్ స్టేషన్ వద్ద నంద్యాల రూరల్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు ముగ్గు చూపుతున్నట్లు సమాచారం.మహానంది పోలీస్ స్టేషన్ వద్ద సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని మరో వాదన కొనసాగుతుండటం ప్రాధాన్యత సంతరించు ఉన్నట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారుల అదేసాలే శిరోధార్యంగా భావిస్తూ అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం.కొందరు ప్రజాప్రతినిధులు దీనిపై పలు సందిగ్ధలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఉన్నతాధికారులు అంతిమ నిర్ణయం శిరోధార్యమని పోలీసు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.