💥KCR సొంత జిల్లాలో చక్రం తిప్పుతున్న ఈటల.. ఈ నెల 9న సీఎంకు షాక్!!
నర్సాపూర్: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని.. రాష్ట్రంలో వంద మందికి ఒక బెల్ట్ షాప్ ఏర్పాటు చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ నెల 9వ తేదీన కేంద్రమంత్రి భూపేష్ యాదవ్ నర్సాపూర్ రానున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభాస్థలిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి భూపేష్ యాదవ్ సమక్షంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఇక, ఎనిమిది సంవత్సరాల కాలంలో వేలాది బెల్టుషాపులు ఏర్పాటు చేసి.. లక్షలాది మందిని తాగుబోతులను చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కు వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మంత్రులుగా కొనసాగుతుండడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. మునుగోడులో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. భారీ మెజారిటీతో అక్కడ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.టీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని వృధా చేయడంలో టీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుందని.. వంద సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి.. 40 సంవత్సరాల చరిత్ర గల బీజేపీ లేని పార్టీ ఫండ్ కేవలం ఎనిమిది సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్కు 870 కోట్ల ఆస్తులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. విలువైన భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పారిశ్రామిక వేత్తలకు అప్పగిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్, జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట్ తదితర ప్రాంతాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులతో పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం కొనసాగుతుందని రాజేందర్ తెలిపారు.ఈనెల 9న చేరికలు..నర్సాపూర్ పట్టణానికి మునిసిపల్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మురళి యాదవ్‌తో పాటు కౌన్సిలర్, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి, నర్సాపూర్ నియోజవర్గానికి చెందిన ఆయా కుల సంఘాల నాయకులు ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇంచార్జి తరుణ్ చుగ్ల ఆధ్వర్యంలో చేరనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కౌన్సిలర్లు రాజేందర్ బుచేశ యాదవ్, లత రమేష్ యాదవ్, సురేష్ యాదగిరి, బీజేపీ సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, కొత్త శ్రీనివాస్ గుప్తా, శంకర్ తదితరులు ఉన్నారు.