మాంసం ప్రియులకు దసరా సందర్భంగా చౌక విక్రయాలు..
రామేశ్వరంలో గొర్రె పోటేళ్ల అమ్మకాలు
2,3,4,5 తేదీల్లో అమ్మకాలు
మాంసం ప్రియులకు నాణ్యమైన గొర్రె పొట్టేళ్లను విక్రయించేందుకు మండల పరిధిలోని రామేశ్వరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరసమైన ధరలకు మంచి గొర్రె పొట్టేళ్లను ఈ విజయదశమి కోసం విక్రయాలు జరిపేందుకు నాలుగు రోజుల పాటు అమ్మనున్నారు. అక్టోబర్ 2, 3, 4, 5 తేదీల్లో నాలుగు రోజులపాటు గొర్రె పొట్టేళ్ల విక్రయాలు జరుగుతున్నట్లు బాలరాజ్ మీడియాకు తెలిపారు. మాంసం ప్రియులకు నేటి పరిస్థితుల్లో ఆరోగ్యకర జంతు మాంసం దొరకడం గగనంగా మారింది. కొందరు స్వార్ధ ప్రయోజనాల కోసం అనారోగ్యంతో మరణించిన, రోగాలున్న, శారీరకంగా బలహీనంగా ఉన్న జీవాలను వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మాంసం దుకాణాల వద్ద జంతువులను వధించి వాటి కలాసాలను, వ్యర్థాలను కాల్వల్లో వేస్తున్నారు. అమ్మకాల కోసం వేలాడదీసిన మాంసంపై మలినాలు, దుమ్ము పడుతున్నా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జంతువుల మాంసాన్ని శుభ్రం చేసేందుకు వినియోగించే నీరుకూడా అపరిశుభ్రంగా వుంటోంది. జంతువులను వధించిన తలలకు రక్తం కారుతున్నా వాటిపై ఎలాంటి వస్త్రం వేయకపోవడంతో ఈగలు ముసిరి దుర్భరంగా కనబడుతోంది. దీంతో నాణ్యమైన మాంసాన్ని ప్రజలు గుర్తించలేకున్నారు. అందుకే ఈ దసరా పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున గొర్రె పొట్టేలను నేరుగా ప్రజలకు విక్రయించేందుకు ఏర్పాట్లు జరిగాయి. తక్కువ ధరలో మాంసాన్ని విక్రయించే అవకాశాలు ఉన్నాయి.