శిక్షణ తరగతుల ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా దసరా సెలవులను పురస్కరించుకొని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ, కురుమన్న గారి సహాయ సహకారాలతో ప్రిన్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వారం రోజులపాటు 50 మంది ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు చిత్రలేఖనం, ఆటల పోటీలు, చిత్రకళ నైపుణ్యం (క్రాఫ్ట్), సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ప్రిన్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గిరిబాబు తెలిపారు. అలాగే ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న గారు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో న్యాయవాది వరలక్ష్మి దేవి, ప్రిన్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గిరిబాబు, అనుదీప్ గౌడ్, ఆనంద్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతులు కావలసిన స్టడీ మెటీరియల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ విద్యార్థులకు అందజేశారు. అలాగే వరలక్ష్మి దేవి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరమ్మ మాట్లాడుతూ.. సృజనాత్మక ఆలోచన పెంచుకోవాలని ప్రతి ఒక్కరు చిత్రలేఖనం లో వారి నైపుణ్యాన్ని కనబరచాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చేస్తామని అన్నారు. న్యాయవాది వరలక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రిన్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.