ఓట్లు కాదు ముఖ్యం ప్రజల సౌకర్యమే
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్,అక్టోబర్ 01,మహానంది:
ఓట్లు కాదు ముఖ్యంప్రజల సౌకర్యం మేనని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శనివారం మహానందిలో పునరుద్ఘాటించారు
మహానందిలో మండల తాసిల్దార్ కార్యాలయం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ కొందరు తిమ్మాపురం గ్రామంలో మండల కార్యాలయాలు ఉండాలని కోరుకుంటున్నారని అందుకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూసిన తాను వెనుకడుగు వేయకుండా మహానందిలో తాసిల్దార్ కార్యాలయం ఉండేవిధంగా ఏర్పాటు చేశాను అన్నారు.ఎంపీడీవో కార్యాలయం కూడా మహానందికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం అన్నారు.అభివృద్ధి పనులు చేస్తే ప్రజలు ఓటు వేస్తారని రాజకీయం చేయడం పద్ధతి కాదని పరోక్షంగా కొందరిని హెచ్చరించినట్లు అయింది.మసీదుపురం, గాజులపల్లె,గోపవరం తదితర గ్రామాలతో పాటు ఇతర గ్రామాలకు మహానందిలో మండల కార్యాలయాలు ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీనిని అర్థం చేసుకోవాలని సూచించారు.మహానంది క్షేత్రం లో 100 వసతి గృహాలు ఏర్పాటు చర్యలు తీసుకుంటామని అందులో భాగంగా మొదటి విడతగా50 వసతి గృహాలు ఏర్పాటుకు అనుమతి వచ్చినట్లు తెలిపారు.దాతల సహకారంతో 100 వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఏసీ లతో నిర్మాణానికి 10 లక్షలు మరియు షూట్ నిర్మాణానికి 15 లక్షలు దాతలు చెల్లిస్తే వారి పేర్లు శిలాఫలకంపై వేయడంతోపాటు దాదాపు 45 రోజుల పాటు సంవత్సరంలో వారికి మరియు వారు పేర్కొన్నబంధుమిత్రులకు ఉచితంగా వసతి గృహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.దేవాదాయ శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయని పనులు కూడా ప్రారంభించడానికి టెండర్లు త్వరలో ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి,తాసిల్దార్ జనార్దన్ శెట్టి, డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి,
ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,ఎస్సై నాగార్జున రెడ్డి,ఎంపీడీవో శివ నాగజ్యోతి,సర్పంచ్ శిరీష, జడ్పీటీసి కేవీఆర్ మహేష్ రెడ్డి,ఎంపీటీసీ వెంకటేశ్వర్లు,వ్యవసాయ మండలి సలహా చైర్మన్ శరభ రెడ్డి,వైసిపి మండల ,గ్రామ నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, వీరా రెడ్డి, బండి రమణయ్య, పుల్లయ్య యాదవ్, కందుల రఘురామ్ రెడ్డి,వడ్డే శ్రీనివాసులు, గోపవరం కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డి,మద్దుల బాల వెంకట్ రెడ్డి,వీఆర్వో వెంకట రాముడు, వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.