వాల్మీకి లను విస్మరించిన ప్రభుత్వం బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి.
నల్లా గుడ్డ తో నిరసన చేపట్టిన వాల్మీకి కులస్తులు
గద్వాల : తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన ప్రభుత్వ ఉత్తర్వు లో ఎస్టీ లకు 10 శాతం రిజర్వేషన్ పెంచడం హర్షిస్తూ… అందులో వాల్మీకి కులస్తులను చేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందని శనివారం జిల్లా కేంద్రము లోని అంబేడ్కర్ సర్కిల్ లో నాయకులూ నల్ల గుడ్డ కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరము అబెడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగ నాయకుల మాట్లడుతూ….ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నిక ల ముందు బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చిందని , ప్రభుత్వం చెళ్ళప్పా కమిటి వేసి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టారని తెలిపారు.శుక్రవారం ప్రకటించిన ఎస్టి రిజర్వేషన్ పెంపు ఉత్తర్వు లో వాల్మికి ల ప్రస్తావన లేకపోవడం విచారకరమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ లో వాల్మికుల ఎస్టీ జాబితాల చేర్చడం పై ప్రత్యేకమైన తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగ రాబోయే కాలంలో ఎస్టీ జాబితాలో చేర్చడం అంశం పై దశల వారీగా ప్రభుత్వం పై పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ నెల 03 వ తేదీన రాష్ట్ర వాల్మికి భందువుల సమ్మేళనం గద్వాల పట్టణం లో వాల్మికి భవన్ లో నిర్వహించడం జరుగుతుందనీ ఆ సమావేశం లో తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో నాయకులు వైన్డింగ్ రాములు, బాసు హనుమంతు, మధు, వెంకట్ నారాయణ, కొటేశ్, మురళీ,నాగ శంకర్ , వెంకటన్న, గోవిందు, పరుష రాముడు, రఘు నాయుడు, సవరన్న, వీరేశ్, కృష్ణయ్య, రాము, శ్రీను, నాగరాజు, ఇతర కులస్తులు పాల్గోన్నారు….