చేవెళ్ల:
చేవెళ్ళ పట్టణంలో ఈ నెల 12న నిర్వహించనున్న హనుమాన్ జయంతి (వీర హనుమాన్ విజయ యాత్ర) కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను మంగళవారం మండల దళ్ గో రక్ష ప్రముఖ్ మల్లేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు, రేగడి ఘనాపూర్, కిష్టాపూర్, మీర్జాగూడ, కమ్మెట, ధర్మసాగర్, కుమ్మెర, రావులపల్లి, ముడిమ్యాల గ్రామాలాల్లో హిందూ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. చేవెళ్ళ పట్టణంలో భారీ ఎత్తున నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
