- రాష్ట్ర గోరక్ష దళ్ మెంబర్ గొంగు పల్లి రాఘవేందర్
చేవెళ్ళ ఏప్రిల్ :-
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ నెల 12న నిర్వహిస్తున్న వీర హనుమాన్ విజయయాత్ర విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర గోరక్షదళ్ మెంబెర్ గుంగుపల్లి రాఘవేందర్ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హిందూ బంధువులంతా సంకటితమై హనుమత్ బ్రహ్మోత్సవం న హిందూ శక్తి చాటాలన్నారు. హిందువుల పట్ల జరుగుతున్న అరాచకాలపై ఆయన విచారణ చెందారు. అందుకు హిందువుల సత్తా చాటేందుకు ఈనెల 12న విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో చేవెళ్ల నగరంలో జరిగే శోభాయాత్రలో హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.