స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:నిర్మాణాలు వేగవంతంగా ఉండేందుకు లబ్ధిదారులను ప్రోత్సహించాలి.హౌసింగ్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. గురువారం కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట పరిధిలో దామరచెరువు గ్రామంలో కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు.అనంతరం రామాయంపేటలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పరిశీలించారు.ఎంపీడీవో కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసిన కలెక్టర్ రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్ ను పరిశీలించిన కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల మోడల్ ఇంటి నిర్మాణ పనులపై ఆరా తీశారు.ఇంటి లోపల డిజైన్‌ సౌకర్యాలపై అధికారులకు సిబ్బందికి కీలక సూచనలు చేశారు.పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఇంటి నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ పథకం ద్వారా పేదలకు మంచి గృహాలు అందించడమే లక్ష్యమని తెలిపారు.పనుల్లో ఆలస్యం లేకుండా నాణ్యతతో కూడిన నిర్మాణం జరగాలని అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. అనంతరం రామాయంపేటలో రాజీవ్ యువ వికాసం పథకం హెల్ప్ డెస్క్ ను కలెక్టర్ సందర్శించారు.దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను
అడిగి తెలుసుకున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకొని తమ ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేందుకు యువతకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుందని యువత రాజీవ్ యువ వికాసం పథకం సద్వినియోగం చేసుకోవాలని లబ్ధి పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం హౌసింగ్ అధికారులు సంబంధిత రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!